హోంగార్డ్‌తో మసాజ్ : ఏఎస్ఐ ఔట్ : Video : ASI suspended over viral video

  • 7 years ago
An Assistant Sub-Inspector of police in Telangana’s Jogulamba Gadwal district was caught taking massage by a woman home guard in the restroom of a police station. The act was caught on camera, where the woman home guard was in uniform when she was giving massage to the ASI.

హైదరాబాద్‌లోని సరూర్ నగర్‌లో ఇటీవలే ఆర్డర్లీ వ్యవస్థ వెలుగు చూసింది. తాజాగా, జోగుళాంబ గద్వాల జిల్లాలోను మరొకటి వెలుగు చూసింది.
సరూర్ నగర్ సీఐ లింగయ్య సైదానాయక్ అనే కానిస్టేబుల్‌తో మసాజ్ చేయించుకున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. . దీనిపై అప్పట్లో రాచకొండ సీపీ మహేష్ భగవత్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించారు.
ఇక ఇప్పుడు జోగుళాంబ గద్వాల జిల్లాలో ఓ మహిళా హోంగార్డ్‌తో ఏఎస్‌ఐ మసాజ్ చేయించుకుంటూ మీడియాకు చిక్కాడు. ఘటన బయటకు రావడంతో ఉన్నతాధికారులు రహస్యంగా విచారణ జరిపిస్తున్నారని తెలుస్తోంది. మహిళా హోంగార్డుతో మసాజ్ చేయించుకున్నది సాయుధ రిజర్వ్ ఏఎస్ఐగా తెలుస్తోంది. ఐతే ఏఎస్‌ఐ హసన్‌ను సస్పెండ్ చేస్తూ తెలంగాణ పోలీసు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
హసన్ గత కొద్దికాలంగా కిందిస్థాయి సిబ్బందితో సపర్యలు చేయించుకుంటున్నాడనే ఆరోపణలు వచ్చాయి. ఐతే అతన్ని రెడ్ హ్యాండేడ్ గా పట్టుకోవడానికి ఎవరో సీక్రెట్ కెమెరా అమర్చారు. దీంతో హాసన్ అడ్డంగా దొరికిపోయాడు.

Recommended