Pawan Kalyan recruiting 840 members as incharges
  • 6 years ago
Janasena chief Pawan Kalyan will recruiting 840 members as incharges for 42 parliament segments in Two telugu states.

జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ ఏపీ రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడ పార్టీని బలోపేతం చేసేందుకు సన్నాహలు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేయనున్నట్టు పవన్‌కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఎన్నికల సమయం నాటికి రెండు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాలని పవన్ భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో పోటీకి పవన్ కళ్యాణ్ అస్త్రాలను సిద్దం చేసుకొంటున్నారు. అయితే పోటీ చేసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో నాయకులను తయారు చేసుకొనేందుకు కసరత్తు చేస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఇంఛార్జులను నియమించే పనిలో పార్టీ నాయకులు హరిప్రసాద్, మహేందర్ రెడ్డి, శంకర్ గౌడ్ బిజీ‌ బిజీగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో‌ ఉన్న 42 పార్లమెంట్ నియోజక వర్గాల్లోని 22 నియోజకవర్గాలకు ఇంఛార్జులను నియమించారు.ఆంధ్రలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ పదిహేడు నియోజకవర్గాలకు ఇంఛార్జులను నియమించారు. తెలంగాణలో వరంగల్ నల్లగొండ భువనగిరి కరీంనగర్ ఖమ్మం పార్లమెంటరీ నియోజక‌వర్గాలకు ఇంఛార్జులను నియమించారు.
Recommended