TDP-Congress Alliance : Sonia Gandhi's Support To TDP
  • 6 years ago
Unhappy with Arun Jaitley's statement in Parliament on the allocation of funds for AP, TDP president and Andhra Pradesh chief minister Nara Chandrababu Naidu is reported to have told his party MPs that "the Centre is behaving in such a way that it is making people of AP feel that they are not part of the nation".

బడ్జెట్ తొలి విడత సమావేశాలు శుక్రవారంతో ముగియనున్నాయి. బడ్జెట్‌లో ఏపీకి అన్యాయానికి తోడు ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నుంచి కేంద్రమంత్రులు తదితరుల నుంచి ఎలాంటి హామీలు రాకపోవడంతో పార్లమెంటు ఉభయ సభల్లో ఆందోళన చేయాలని చంద్రబాబు పార్టీ ఎంపీలకు గురువారం సాయంత్రం సూచించారని తెలుస్తోంది.
ఆయన పార్టీ ఎంపీలతో శుక్రవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. మొన్న ప్రధాని మోడీ ప్రసంగం, నిన్న అరుణ్ జైట్లీ ప్రసంగంపై చంద్రబాబు తీవ్ర అసహనంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీలు నిరసన తెలపాలని ఆయన సూచించే అవకాశముంది.
గురువారం లోకసభలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ ఎంపీలు.. సోనియా గాంధీని కలిసిన విషయం తెలిసిందే. అంతేకాదు, సభలోను ఏపీ ఎంపీలకు ఆమె మద్దతు తెలిపారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలంటూ ఏపీ టీడీపీ ఎంపీలు నినాదాలు చేస్తూ.. వియ్‌ వాంట్‌... గట్టిగా స్లోగన్స్ ఇచ్చారు. వారి వెనుక సీట్లో కూర్చున్న సోనియా గాంధీ 'జస్టిస్‌' అని చిన్నగా అన్నారని తెలుస్తోంది. కొద్దిసేపు ఆమె 'జస్టిస్‌...' అన్న నినాదాన్ని కొనసాగించారట.
లోకసభలో గురువారం సాయంత్రం జైట్లీ ఏపీకి ఇచ్చిన అంశాలను ప్రస్తావించిన విషయం తెలిసిందే. రెండు రోజుల్లో మరిన్ని వివరాలు ఇస్తామని చెప్పారు. జైట్లీ ప్రకటనపై టీడీపీ ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ సమయంలో జైట్లీ మాట్లాడుతూ.. అప్పులు తెచ్చి రాష్ట్రాలకు పంచలేమని అభిప్రాయపడ్డారు.
Recommended