Avengers Infinity War:Overseas Collections

  • 6 years ago
Avengers Infinity War hit the screens this week, and Indian fans have been in a tizzy. The craze for advance bookings reached such a pitch that several shows were sold out within minutes. Avengers Infinity War has made Rs 29 crore in the advance bookings alone. And, it doesn't stop there. Trade analysts expect the film to make around Rs 20 crore on the first day itself. The figures are expected to go higher, as there were ticket counter purchases as well.
ప్రతిష్టాత్మకంగా రూపొందిన హాలీవుడ్ చిత్రం అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తున్నది. తొలిరోజే అదిరిపోయే కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం బాలీవుడ్ బడా హీరోల సినిమాకు ధీటుగా ఇండియన్ సినీ మార్కెట్‌లో వసూళ్లను రాబట్టడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. రిలీజ్ రోజున సుమారు రూ.20 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేశారు. కానీ ట్రేడ్ పండితుల అంచనాలకు మంచి భారీ రేంజ్‌లో కలెక్షన్లను రాబట్టింది.
ప్రపంచవ్యాప్తంగా అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ ఏప్రిల్ 27న రిలీజైంది. కేవలం అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే రూ.29 కోట్లు రాబట్టింది. శుక్రవారం రాత్రి వరకు వచ్చిన రిపోర్టుల ప్రకారం ఈ చిత్రం రూ.30 కోట్లకు పైగానే వసూలు చేసినట్టు సమాచారం. బాలీవుడ్ సూపర్‌స్టార్లు అమీర్‌ఖాన్, సల్మాన్ ఖాన్ నటించిన దంగల్, టైగర్ జిందా హై చిత్రాల సాధించిన వసూళ్లను మించి కలెక్షన్ల సాధిస్తున్నది.
బాలీవుడ్‌లో అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ నటించిన చిత్రాలు 4000 థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. కానీ అవెంజర్ ఇన్ఫినిటీ వార్ చిత్రం కేవలం 2000 స్క్రీన్లలో మాత్రమే రిలీజైంది. అయితే దంగల్ చిత్రం తొలిరోజున రూ.29.78, టైగర్ జిందాహై రూ.33.75 కోట్లు సాధించాయి. తొలివారాంతానికి ఈ చిత్రం వంద కోట్ల చేరువలో వచ్చే అవకాశం ఉందనే మాట వినిపిస్తున్నది.
#Avengers Infinity War
#salman khan
#aamir khan
#dangal

Recommended