India Beats Ireland Once Again

  • 6 years ago
Team India once again thumped Ireland by a mammoth 143 runs clinching the T20I series 2-0. Spin duo of Yuzvendra Chahal and Kuldeep Yadav once again tormented through the Irish batting line-up picking up 6 for 37 together and bundled out the hosts for 70 in 12.3 overs. Chasing a daunting total of 214, Ireland never seemed to be in the game.

పర్యటనలో ప్రాక్టీసు మ్యాచ్‌లు కింద భావించిన టీమిండియా బ్యాట్స్‌మెన్ అనుకున్నంత పని చేశారు. ఐర్లాండ్‌ను 2-0తేడాతో క్లీన్ స్వీప్‌కు గురి చేశారు. తొలి టీ20లో 76 పరుగుల తేడాతో గెలుపొందిన టీమిండియా.. శుక్రవారం రాత్రి జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఏకంగా 143 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ని 2-0తో చేజిక్కించుకుంది.
తొలుత ఓపెనర్ కేఎల్ రాహుల్ 36 బంతుల్లో 3ఫోర్లు, 6 సిక్సులు(70), సురేశ్ రైనా 45 బంతుల్లో 5ఫోర్లు, 3 సిక్సులు (69), హార్దిక్ పాండ్య 9 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సులతో (32) నాటౌట్‌లతో మెరుపులు మెరిపించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్ జట్టు మరోసారి భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (3/16), చాహల్ (3/21) ధాటికి చేతులెత్తేసింది. క్రమం తప్పకుండా స్పిన్నర్లు వికెట్లు తీయడంతో ఆ జట్టు 12.3 ఓవర్లలో 70 పరుగులకే పేకమేడలా కుప్పకూలిపోయింది. ఆ జట్టులో ఏడు మంది బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమవగా.. అందులో ముగ్గురు డకౌటవడం విశేషం. ఇక భారత జట్టు జూలై 3 నుంచి ఇంగ్లాండ్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలతో పాటు ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ ఆడనుంది.
#india
#ireland
#cricket
#viratkohli
#sikhardhawan

Recommended