Wriddhiman Saha 102 Runs In 20 Balls : Reactions

  • 6 years ago
Team India wicketkeeper Wriddhiman Saha declared his form before the start of the Indian Premier League by smashing 102 runs off just 20 balls on Saturday as his team Mohun Bagan beat BNR Recreation Club by 10 wickets in JC Mukherjee T-20.

ఐపీఎల్‌కు ముందు ఆటగాళ్లంతా మంచి ఫామ్‌లో కనిపిస్తున్నారు. రెండు వారాల క్రితం నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై దినేశ్ కార్తీక్ అద్భుత బ్యాటింగ్ చూశాం. 8 బంతుల్లో 29 పరుగులు చేసిన కార్తీక్ చివరికి బంతికి సిక్స్ బాది భారత్‌కు ఒంటి చేత్తో కప్ అందించాడు. అదే బాటలో మరో టీమిండియా వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ వృద్ధిమాన్‌ సాహా కూడా చెలరేగిపోయాడు.
బెంగాల్‌ స్థానిక క్రికెట్‌ టోర్నీలో అతడు కళ్లుచెదిరే ఇన్నింగ్స్‌ ఆడాడు. 14 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 510 స్ట్రైక్‌రేట్‌తో అతడు మెరుపు సెంచరీ సాధించాడు. అతడి ధాటికి మోహన్‌ బగాన్‌ జట్టు కేవలం 7 ఓవర్లలో 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. జేసీ ముఖర్జీ టోర్నీలో భాగంగా శనివారం జరిగిన టీ20 టోర్నీలో బీఎన్‌ఆర్‌ రిక్రియేషన్‌ క్లబ్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఓపెనర్‌గా బరిలో దిగిన సాహా (102 నాటౌట్‌) 20 బంతుల్లో 4 ఫోర్లు, 14 సిక్సులు మరో ఓపెనర్‌ శుభోమయ్‌ దాస్‌ (43 నాటౌట్‌) 22 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులుతో కలిసి ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను ఉతికిపారేశాడు. తొలి బంతికి సింగిల్‌ తీసిన అతడు.. ఆ తర్వాత 19 బంతుల్లో మరోసారి మాత్రమే సింగిల్‌ చేశాడు. 12 బంతుల్లో 50 పరుగుల మార్క్‌ చేరుకున్న సాహా.. ఆ తర్వాత 100 మైలురాయి అందుకోవడానికి ఆడింది 8 బంతులే.
ఐతే స్థానిక క్రికెట్‌ టోర్నీ కావడంతో సాహా ఇన్నింగ్స్‌ను రికార్డుగా పరిగణించరు. టీ20ల్లో వేగవంతమైన సెంచరీ క్రిస్‌గేల్‌ (30) పేరిట ఉంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ తరఫున అతడు ఈ రికార్డు సాధించాడు. క్లబ్‌ క్రికెట్లో 17 బంతుల్లోనే ఓ క్రికెటర్‌ సెంచరీ చేశాడని సమాచారం.

Recommended